మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చుతున్న త్రివిక్రమ్?

మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చుతున్న త్రివిక్రమ్?
X
త్రివిక్రమ్ రీసెంట్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్, “అనిమల్” సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో డిస్కషన్స్ జరిపాడట.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ తన తదుపరి సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చబోతున్నాడా? అతని టీమ్ నుంచి వచ్చిన తాజా అప్‌డేట్స్ అలాంటి సంకేతాలిస్తున్నాయి మరి. తాజా సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ రీసెంట్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్, “యానిమల్” సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఫేమస్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో డిస్కషన్స్ జరిపాడట.

హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఫైనల్ చేశారా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ వీళ్లిద్దరూ కలిసి పని చేసే ఛాన్సెస్ బాగానే ఉన్నాయని టాక్. త్రివిక్రమ్ రీసెంట్‌గా రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. ఒకటి లార్డ్ మురుగన్ కథాంశం ఆధారంగా ఒక మైథలాజికల్ డ్రామా. ఇందులో ఎన్టీఆర్ లీడ్ రోల్‌లో కనిపించనున్నాడు. మరొకటి వెంకటేష్‌తో ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇది రీసెంట్‌గా అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. షూటింగ్ నవంబర్‌లో స్టార్ట్ కానుంది.

“అరవింద సమేత” నుంచి త్రివిక్రమ్ కంటిన్యూస్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో వర్క్ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ కొత్త ప్రాజెక్ట్స్‌కి కూడా తమన్ ఎంపికవుతాడని చాలామంది అనుకున్నారు. కానీ, త్రివిక్రమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో రీసెంట్ ఇంటరాక్షన్... ప్లాన్స్‌లో మార్పు ఉండొచ్చని హింట్ ఇస్తోంది.

తన డైరెక్టోరియల్ డెబ్యూ “నువ్వే నువ్వే” నుంచి త్రివిక్రమ్... కోటి, మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, మిక్కీ జే మేయర్, అనిరుద్ రవిచందర్, తమన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వర్క్ చేసి.. ప్రతీ ఒక్కరి నుంచి మెమరబుల్ మ్యూజిక్ రాబట్టాడు. ఇప్పుడు హర్షవర్ధన్ రామేశ్వర్ కూడా ఈ సక్సెస్‌ఫుల్ జర్నీలో భాగమవుతాడేమో చూడాలి.

Tags

Next Story