పూరి- సేతుపతి చిత్రానికి మ్యూజిక్ ఇతడే!

సందీప్ రెడ్డి వంగా తీసిన బ్లాక్‌బస్టర్ సినిమా “యానిమల్”కి మ్యూజిక్ ఇచ్చి సెన్సేషన్ అయిన హర్షవర్ధన్ రామేశ్వర్ కి పెద్ద పెద్ద ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. ప్రభాస్ రాబోయే సినిమా “స్పిరిట్” కి అతను ఇప్పటికే సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పుడు.. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి హీరోగా రానున్న కొత్త సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్ఫర్మ్ అయ్యారు.
"బ్లాక్‌బస్టర్ కంపోజర్, ఆయన మ్యూజిక్ చాలా గట్టిగా మాట్లాడుతుంది" అంటూ ఈ సినిమా టీమ్ హర్షవర్ధన్‌కి వెల్‌కమ్ చెప్పింది. పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు-తమిళ బైలింగ్యువల్ మూవీలో విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటిస్తుండగా, టబు కీ రోల్‌లో, సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు.
గతంలో పూరీ జగన్నాధ్, మణిశర్మ, చక్రి, సందీప్ చౌతా లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో వర్క్ చేశారు. ఇప్పుడైతే, ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హర్షవర్ధన్ రామేశ్వర్తో కలిసి తన సినిమా మ్యూజిక్‌కి కొత్త ఎనర్జీని తీసుకురాబోతున్నారు.
‘స్లమ్‌డాగ్’ అనే టైటిల్ (వర్కింగ్ టైటిల్) అనుకుంటున్న ఈ సినిమాని పూరీ జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి నిర్మిస్తున్నారు. "నేషనల్ అవార్డు విన్నర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ కి పూరి సేతుపతి టీమ్ స్వాగతం చెబుతోంది. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్‌తో కూడిన న్యూ-ఏజ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం రెడీ అవ్వండి," అని టీమ్ పోస్ట్ చేసింది.
-
Home
-
Menu