యూఎస్ అడ్వాన్స్ సేల్స్ లో అదరగొడుతోంది !

యూఎస్ అడ్వాన్స్ సేల్స్ లో అదరగొడుతోంది !
X
యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆశించిన స్థాయిలో జోరు లేదని టాక్ నడిచింది. కానీ, ఇప్పుడు స్థితి కాస్త మెరుగైంది. యూఎస్ లో ఇప్పటివరకు అడ్వాన్స్ టికెట్ సేల్స్ 135 కే డాలర్లు వసూలు చేసి, కొత్త ఉత్సాహాన్ని చూపిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘హరిహర వీర మల్లు’ జూన్ 12న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమా యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఆశించిన స్థాయిలో జోరు లేదని టాక్ నడిచింది. కానీ, ఇప్పుడు స్థితి కాస్త మెరుగైంది. యూఎస్ లో ఇప్పటివరకు అడ్వాన్స్ టికెట్ సేల్స్ 135 కే డాలర్లు వసూలు చేసి, కొత్త ఉత్సాహాన్ని చూపిస్తోంది.

అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. వివిధ సిటీల్లో సెలబ్రేటరీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్‌లో 100 కోట్ల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా ట్రైలర్ జూన్ 5న రిలీజ్ కానుంది, కానీ సీజీ వర్క్ కారణంగా కొంచెం ఆలస్యమైంది. ధర్మం కోసం జరిగే ఎపిక్ వార్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నిర్భయ యోధుడిగా కనిపించ నున్నాడు. ఇప్పటికే ఈ మూవీ భారీ బజ్ క్రియేట్ చేసింది.

‘హరిహర వీర మల్లు’ సినిమా దాదాపు నాలుగేళ్లుగా తెరకెక్కుతోంది. మొదట ఈ ప్రాజెక్ట్‌ని క్రిష్ డైరెక్ట్ చేశాడు. అతనే కథ, స్క్రీన్‌ప్లే రాసి, షూటింగ్‌లో 70 శాతం పూర్తి చేశాడు. కానీ, తర్వాత అనుష్క నటిస్తున్న తన మరో సినిమా గాటి కోసం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత జోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలు తీసుకొని మిగిలిన భాగం పూర్తి చేశాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా నిలవనుంది. హీరోయిన్‌గా నిధి అగర్వాల్, విలన్‌గా బాబీ డియోల్ నటిస్తున్నారు.

Tags

Next Story