బుర్జ్ ఖలీఫాపై ‘హరిహర వీరమల్లు’ విజువల్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహరవీరమల్లు’ టీం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా మీద సినిమా విజువల్స్ ప్రొజెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు మూవీ ఇలా ప్రపంచంలోనే టాప్ బిల్డింగ్‌పై లైమ్‌లైట్‌లోకి రావడం ఇదే మొదటి సారి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది ఓ ఫుల్ థ్రిల్ కిక్. సినిమా మామూలుగా ఉండదని సూపర్ హైప్ సెట్ చేసింది. ఈవెంట్ జస్ట్ షోఅఫ్ కోసం కాదు. మేకర్స్‌కి సినిమాపై ఉన్న గట్స్‌ని చూపెట్టింది. విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది.
పవన్ రాయల్ అవతార్‌లో ఇమేజెస్, సినిమా క్లిప్స్ దుబాయ్ నైట్ స్కైని లైటప్ చేశాయి. ఆన్‌లైన్‌లోనూ, గ్రౌండ్‌లోనూ ఫ్యాన్స్ రచ్చ రచ్చే. ఈ వైబ్ సినిమాని నెక్స్ట్ లెవెల్‌గా తీసుకెళ్లింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ జోడీగా కనిపిస్తోంది. కొన్ని డిలేస్ ఫేస్ చేసినా, ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అవుతుండగా హైప్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసింది.
ప్రమోషనల్ స్టఫ్ అంతా విజువల్‌గా లిట్‌గా, హిస్టారికల్ డ్రామాకి సాలిడ్ రూట్స్‌తో కనిపిస్తోంది. బుర్జ్ ఖలీఫా డిస్‌ప్లే బహుశా తెలుగు సినిమాకి ఇప్పటివరకూ సూపర్ కూల్ ప్రమోషన్. ఇది రీజనల్ సినిమా గ్లోబల్ స్టేజ్‌కి ఎలా ఎగిరిందో చూపిస్తోంది. ప్రమోషన్స్‌లో ఈ జోష్ ఉంటే, సినిమా కూడా ఈ స్కేల్‌కి మ్యాచ్ అవ్వబోతుందేమో.
-
Home
-
Menu