‘హరిహర వీరమల్లు’ మళ్లీ వాయిదా పడనుందా?

‘హరిహర వీరమల్లు’ మళ్లీ వాయిదా పడనుందా?
X
జూన్ 12న షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా వార్తలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. నిన్న జరగాల్సిన సెన్సార్ సర్టిఫికేషన్ ఊహించని విధంగా వాయిదా పడింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ పీరియడ్ యాక్షన్ డ్రామా “హరి హర వీర మల్లు”. ఈ మూవీ మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. జూన్ 12న షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కానున్న ఈ సినిమా వాయిదా వార్తలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. నిన్న జరగాల్సిన సెన్సార్ సర్టిఫికేషన్ ఊహించని విధంగా వాయిదా పడింది.

సెన్సార్ బోర్డు సోర్సెస్ ప్రకారం.. నిర్మాతలు ఈ రోజు లేదా రాబోయే రోజుల్లో కొత్త అపాయింట్‌మెంట్ కోసం అభ్యర్థన చేయలేదు. దీంతో రిలీజ్ డేట్ మారే అవకాశం గురించి ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, ఇంకా ఇతర పోస్ట్-ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఈ అనిశ్చితి తలెత్తినట్లు ఇన్‌సైడర్స్ చెబుతున్నారు. టీమ్ కొత్త రిలీజ్ విండోను టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం, అయితే ఇంకా అధికారిక నిర్ధారణ రాలేదు.

ఎ. జోతి కృష్ణ డైరెక్షన్‌లో, పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న ఈ సినిమా జూన్ 12న రిలీజ్ అవుతుందా లేక మరోసారి వాయిదా పడుతుందా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story