‘‘హరిహర వీరమల్లు’’ ఆలస్యం.. రాజకీయ బాధ్యతలే కారణం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తన సినిమా ‘హరిహర వీరమల్లు’ చాలా భాగం పూర్తయినప్పటికీ, రాజకీయ బాధ్యతల కారణంగా చిత్ర నిర్మాణంలో ఆలస్యం ఏర్పడిందన్నారు. పార్ట్ 1 షూటింగ్ పూర్తి కాగా, పార్ట్ 2 కోసం ఇంకా కొంత పని మిగిలి ఉందన్నారు. 2024 ఎన్నికల ముందు నుంచి రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉండటంతో షూటింగ్‌కు సమయం కేటాయించలేకపోయానని వివరించారు.
ఇప్పటి నుంచి వచ్చే ఏడు సంవత్సరాల వరకు సినిమాలకు పూర్తిగా న్యాయం చేయలేను, అని పవన్ చెప్పారు. చిరంజీవిగారి అనుభవం చూసి సినిమాల నుంచి ప్రజల్లోకి చేరాలనే సంకల్పం తీసుకున్నాను. కానీ నేడు నేను రాజకీయాల్లో ఒక స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాను అన్నారు. ఈ మాటల ద్వారా తాను పూర్తిగా ప్రజాప్రతినిధిగా మారిన సంగతి స్పష్టం చేశారు.
సినిమా నటుడిగా, నాయకుడిగా రెండు విభిన్న బాధ్యతలు ఉండటంతో, ఏదో ఒకదానిపై సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నా నిర్మాతలు, అభిమానులు ఎంతో ధైర్యంగా నన్ను నమ్ముతున్నారు. కానీ నా విధి ప్రజాసేవ. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను రాజకీయాల్లో కొనసాగుతున్నాను అని స్పష్టం చేశారు.
సినీ టికెట్ ధరలపై పవన్ స్పందిస్తూ — టికెట్ల ధరలు తగ్గిస్తే నిర్మాతలు నష్టపోతారు అని, నిర్మాణ ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వాలు నిర్మాతల్ని టికెట్ ధరల వెసులబాటు కల్పించకపోతే ఇండస్ట్రీకి నష్టం అన్నారు. ఎన్నికల ముందు ప్రకటనలు చేసి, తర్వాత వెనక్కి తగ్గితే బాగోదు, అని హెచ్చరించారు. ఇండస్ట్రీ సమస్యలపై తనకున్న అవగాహన, బాధ్యతను ఆయన మరోసారి ప్రదర్శించారు.
పవన్ తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేస్తూ చెప్పారు – ‘‘నా మొదటి సినిమా 'అక్కడ అబ్బాయి ఇక్కడఅమ్మాయి' సినిమాతో మొదలైన నా ప్రస్థానం జానీ ముందు వరకు ఎన్ని విజయాలు వచ్చినా ఆ ఒక్క సినిమా ప్లాప్ తో ఫైనాన్సర్లు అందరూ నా ఇంటికి వస్తే నా రెమ్యూనిరేషన్ తో పాటు మరో రూ.15 లక్షల అప్పు చేసి వాళ్ళకి ఇచ్చేసానుఅని గుతూ చేసారు.అదే ఈరోజు రెండు చోట్ల ఓడిపోయినా నేను ఇంతలా నిలబడటానికి కారణం. జీవితంలో ఓడిపోయినా ధైర్యంగా నిలబడటం ఎలాగో నాకు జానీ సినిమా ఒక గుణపాఠం అయింది అన్నారు పవర్ స్టార్.
తనని ఈ స్థాయిలో ప్రజలకి దగ్గర చేసిన సినిమాలపట్ల ప్రేమతో ఉన్నా, ప్రస్తుతం తన దృష్టంతా ప్రజలపై, రాజకీయ మార్పుపై ఉంది తెలుస్తుంది. సినిమాలు చేసేది నా అభిమానుల కోసం అని చెప్పిన పవన్, ప్రజాస్వామ్యానికి తన నిబద్ధతను మరోసారి గుర్తు చేశారు.
-
Home
-
Menu