ఈ రెండు సినిమాల విడుదల ఎప్పుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు”, రౌడీ హీరో విజయ్ దేవరకొండ “కింగ్డమ్” సినిమాలు రిలీజ్ విషయంలో రిపీట్ మోడ్‌లో వాయిదాల వలయంలో చిక్కుకున్నాయి. ఈ రెండు సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఫ్యాన్స్ పూర్తి నిరాశలో ఉన్నారు.
“హరి హర వీర మల్లు” సినిమా జూన్ 12న థియేటర్స్‌లో సందడి చేయాలని ప్లాన్ చేసినా.. ఆ షెడ్యూల్ నుంచి సైలెంట్‌గా తప్పుకుంది. కొత్త రిలీజ్ డేట్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. నిర్మాత ఎ.ఎమ్. రత్నం ఇంకా రిలీజ్‌కు సంబంధించిన కొన్ని టెక్నికల్ మరియు లాజిస్టికల్ ఇష్యూస్‌ను సాల్వ్ చేసే పనిలో ఉన్నట్లు టాక్. కానీ, ఈ డిలేల వల్ల సినిమా హైప్ కాస్త డౌన్ అవుతోంది, అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి పవర్ఫుల్ స్టార్ సినిమాకి కాస్త నెగటివ్ వైబ్నే క్రియేట్ చేస్తోంది.
మరోవైపు, విజయ్ దేవరకొండ “కింగ్డమ్” కూడా అదే బాటలో ఉంది. ఈ సినిమా కూడా రిలీజ్ వాయిదా పడింది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. “కింగ్డమ్” గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో, ఫ్యాన్స్ మధ్య డౌట్స్ పెరిగిపోతున్నాయి. విజయ్ దేవరకొండ లాంటి యూత్‌ఫుల్ స్టార్ సినిమాకి ఇలాంటి డిలేలు ఖచ్చితంగా డ్యామేజ్ చేసే అంశమే.
ఈ రెండు సినిమాలు ఇప్పుడు బజ్ కోల్పోతూ.. ఆడియన్స్ ఇంట్రెస్ట్‌ని కూడా మిస్ చేస్తున్నాయి. ఒకవేళ కొత్త రిలీజ్ డేట్స్ ఫైనల్ అయితే, ఈ సినిమా టీమ్స్ ప్రమోషన్స్‌ని జీరో నుంచి మళ్లీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఈ రెండు బిగ్ బడ్జెట్ సినిమాలకు ఓ సవాలే. ఫ్యాన్స్ మాత్రం ఈ రెండు సినిమాల గురించి ఏదో ఒక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, కానీ ప్రస్తుతానికి వాళ్లకి వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు.
-
Home
-
Menu