హ్యాపీ బర్త్ డే టు శర్వానంద్!

హ్యాపీ బర్త్ డే టు శర్వానంద్!
X

శర్వానంద్.. ఈ పేరు వినగానే ఓ వెర్సటైల్ యాక్టర్ మన కళ్ల ముందు మెదులుతాడు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగకుండా.. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేక పంథాలో సాగే ఛాలెంజింగ్ హీరో కనిపిస్తాడు. 20 ఏళ్ల వయసులోనే చిత్రరంగ ప్రవేశం చేసిన శర్వానంద్.. అనతి కాలంలోనే హీరోగా సినీ ఇండస్ట్రీలో తన గమ్యాన్ని సెట్ చేసుకున్నాడు. పలు సినిమాల్లో పక్కింటబ్బాయి తరహా పాత్రల్లో కనిపించి.. తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితమైన మోస్ట్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు.

రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో శర్వానంద్ పలు వైవిధ్యభరిత పాత్రలు పోషించాడు. ‘గమ్యం, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు, ఒకే ఒక జీవితం‘ వంటి చిత్రాలు.. శర్వానంద్ కి మంచి విజయాలందించాయి.

ప్రస్తుతం శర్వానంద్ కిట్టీలో మూడు సినిమాలున్నాయి. వీటిలో శర్వానంద్ 36వ చిత్రం యు.వి.క్రియేషన్స్ లో తెరకెక్కుతోంది. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను త్వరలో చేయబోతున్నారు. ఈరోజు శర్వానంద్ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

శర్వానంద్ 37వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి‘. 'సామజవరగమణ' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వాకి జోడీగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు.

ఇక శర్వానంద్ 38వ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకూ ఎక్కువగా రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ చేసిన శర్వానంద్ సంపత్ నంది మూవీ కోసం ఊర మాస్ బాట పడుతున్నాడు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ చిత్రాన్ని సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Tags

Next Story