గుణశేఖర్ కొత్త ప్రయోగం.. ‘యుఫోరియా’ మేజర్ అప్‌డేట్!

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలు అనగానే గుర్తొచ్చే పేరు గుణశేఖర్. ఒకప్పుడు వరుసగా అగ్ర కథానాయకులతో సినిమాలు చేసిన గుణశేఖర్.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో అలరిస్తున్నాడు. 'రుద్రమదేవి, శాకుంతలం' తర్వాత గుణశేఖర్ 'యుఫోరియా' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో భూమిక ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.
గుణశేఖర్-భూమిక కలయికలో వచ్చిన 'ఒక్కడు' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 22 ఏళ్ల తర్వాత 'యుఫోరియా' కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. భూమికతో పాటు, సారా అర్జున్, నాజర్, ఆదర్శ్ బాలకృష్ణ, ఆశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్ వంటి వారు నటిస్తున్నారు. కాల భైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
సమాజంలోని అనేక సమకాలీన సమస్యలను కథాంశంగా తీసుకుని గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తాజాగా ‘యుఫోరియా‘ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు ఓ మేకింగ్ గ్లింప్స్ తో తెలియజేశారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
-
Home
-
Menu