గోపీచంద్ చిత్రానికి అదిరిపోయే టైటిల్ !

లేటెస్ట్ గా అభిమానులందరికీ డైనమిక్ హీరో గోపీచంద్ నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ లభించింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆయన గత సినిమా ‘విశ్వం’ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే ఈసారి గోపీచంద్ పూర్తిగా భిన్నమైన దిశలో అడుగులు వేసాడు. ఎప్పుడూ మసాలా సినిమాలను మాత్రమే చేసే గోపీ ఈ సారి.. కథను లోతుగా చెప్పడంలో పేరు పొందిన ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కొలాబరేట్ అయ్యాడు.
ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న ఈ సినిమా ‘శూల’ అనే వర్కింగ్ టైటిల్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘శూల’ అనేది కేవలం గంభీరంగా అనిపించే టైటిల్ మాత్రమే కాదు. కథలో కీలక పాత్ర పోషించే ఒక ప్రదేశానికి కూడా ఇదే పేరు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, సినిమా సాంఘిక-రాజకీయ అంశాల చుట్టూ సాగే అవకాశం ఉందని, అలాగే.. ఏదైనా ప్రదేశానికి సంబంధించిన సంక్లిష్ట సమస్యలపై దృష్టి సారించే కథా నేపథ్యంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇలాంటి విషయాలను సంకల్ప్ రెడ్డి తన చిత్రాల్లో కచ్చితంగా, సరిగా చూపించడంలో దిట్ట.
ఎప్పుడూ యాక్షన్‌భరిత పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించే గోపీచంద్ ఈసారి మరింత లోతైన, వేరే కోణంలో ఉన్న పాత్ర కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కలయిక అసాధారణంగా అనిపిస్తున్నా, ఇది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సబ్‌మరైన్ థ్రిల్లర్లు, యుద్ధ నేపథ్యంలో డ్రామాలు చేసే దర్శకుడితో ఒక కమర్షియల్ హీరో జోడీ కట్టడం అన్నది సాధారణ విషయం కాదు.
-
Home
-
Menu