మరో యాక్షన్ చిత్రానికి ఓకే చెప్పిన గోపీచంద్?

గోపీచంద్ గత సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి. దీంతో అతని మార్కెట్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు అతడు తిరిగి ఫామ్ లోకి రావడానికి ఒక బలమైన హిట్ చాలా అవసరం. ప్రస్తుతం, అతను ‘గాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డితో ఒక భారీ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెల్సిందే. ప్రెజెంట్ ఇది ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇప్పుడు.. గోపీచంద్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టును సైన్ చేసినట్లు సమాచారం. ప్రముఖ ఫైట్ మాస్టర్ వెంకట్ ఈ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ సినిమా హై-వోల్టేజ్ యాక్షన్‌తో నిండిన పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. ‘డాకు మహారాజ్’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాల్లో శక్తిమంతమైన స్టంట్స్‌ను రూపొందించిన వెంకట్, ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు తీసుకుంటున్నాడు.
గోపీచంద్ కు ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చిందని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ‘యాత్ర’, ‘యాత్ర 2’ వంటి రాజకీయ బయోపిక్‌లను నిర్మించిన 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది. అధికారిక ప్రకటన ఆగస్టు 9న రానుంది.
-
Home
-
Menu