‘ఘాటీ’ చిత్రానికి సెన్సార్ పూర్తి !

‘ఘాటీ’ చిత్రానికి సెన్సార్ పూర్తి !
X
సెన్సార్ బోర్డ్ దీనిని అనుమతించదగిన పరిధిలో ఉన్నట్లు భావించి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 2 గంటల 37 నిమిషాలుగా నిర్ణయించారు.

అందాల అనుష్కా శెట్టి నటిస్తున్న తాజా చిత్రం “ఘాటి”. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. యాక్షన్, హింసాత్మక సన్నివేశాలతో నిండి ఉన్నప్పటికీ, సెన్సార్ బోర్డ్ దీనిని అనుమతించదగిన పరిధిలో ఉన్నట్లు భావించి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్ 2 గంటల 37 నిమిషాలుగా నిర్ణయించారు.

థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌లో అత్యంత ఆకర్షణీయమైన చిత్రంగా ప్రచారం జరుగుతున్న “ఘాటి”లో అనుష్కా శెట్టి ఇప్పటివరకు చూడని కొత్త రూపంలో కనిపించనుంది. ఆమె శీలవతి అనే పాత్రలో.. బాధితురాలి నుండి నేరస్థురాలిగా, అక్కడి నుండి ఒక లెజెండ్‌గా మారే ప్రయాణాన్ని ఎలివేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని ఒడిశాలోని సహజమైన, అస్పృశ్యమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించారు. బాడీ డబుల్స్ లేకుండా నటీనటులు స్వయంగా స్టంట్స్ చేయడంతో, యాక్షన్ సన్నివేశాలు అత్యంత వాస్తవికంగా, ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని భావిస్తున్నారు.

“ఘాటి” చిత్రం ద్వారా లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ మనవడు, నటుడు ప్రభు కుమారుడైన విక్రమ్ ప్రభు హీరోగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రంలో అతను అనుష్కాకు జోడీగా నటిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మరియు చింతకింది శ్రీనివాసరావు ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. “ఘాటి” సినిమా సెప్టెంబర్ 5, 2025న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కాబోతోంది.

Tags

Next Story