తేజ సజ్జా అరుదైన ఘనత !

తేజ సజ్జా అరుదైన ఘనత !
X
రెండో శనివారం ఒక్క రోజులోనే "మిరాయ్" దాదాపు రెండున్నర లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఇప్పటిదాకా ఈ మూవీ 2.5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి, 3 మిలియన్ డాలర్ల టార్గెట్‌ని స్టెడీగా ఛేజ్ చేస్తోంది.

టాలీవుడ్ డైనమిక్ హీరో .. టాలీవుడ్ లో ఒక అరుదైన ఘనత సాధించాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్‌ వద్ద వరుసగా రెండు బ్లాక్‌బస్టర్‌లతో సత్తా చాటుకున్నాడు. "హను మాన్" మాస్ హిట్ తర్వాత, అతని లేటెస్ట్ మూవీ "మిరాయ్" సెకండ్ వీకెండ్‌లోనూ సూపర్ రన్ కొనసాగిస్తోంది. బలమైన టాక్‌తో పాటు సూపర్ రన్ కొనసాగిస్తోంది.

రెండో శనివారం ఒక్క రోజులోనే "మిరాయ్" దాదాపు రెండున్నర లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఇప్పటిదాకా ఈ మూవీ 2.5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్ట్ చేసి, 3 మిలియన్ డాలర్ల టార్గెట్‌ని స్టెడీగా ఛేజ్ చేస్తోంది. ఈ సక్సెస్‌తో తేజ సజ్జా, నార్త్ అమెరికాలో బ్యాక్-టు-బ్యాక్ 2.5 మిలియన్ డాలర్ల+ కలెక్షన్స్ సాధించిన మూడో తెలుగు హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఈ లిస్ట్‌లో ఉన్న మిగతా స్టార్స్ ఎవరంటే... ప్రభాస్, ఎన్టీఆర్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌లో, టీజీ విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన "మిరాయ్" ఓవర్సీస్‌లో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా మారింది. తేజ సజ్జా, విశ్వ ప్రసాద్ ఇప్పుడు మూవీని మరింత హైప్ చేయడానికి యూఎస్‌లో టూర్ చేస్తున్నారు.

Tags

Next Story