5 రోజుల గ్యాప్ తో సంక్రాంతికి వస్తున్నారు

సంక్రాంతి 2026 సినిమా క్లాష్‌పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్, చిరంజీవి నటించిన రెండు బిగ్ టాలీవుడ్ మూవీస్ ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. మొదట్లో బాక్సాఫీస్ వద్ద డైరెక్ట్‌గా ఢీ కొట్టనున్నాయని అందరూ ఊహించారు. కానీ, ఇప్పుడు నిర్మాతలు ఈ క్లాష్‌ను నివారించేందుకు ఓ స్మార్ట్ ప్లాన్ వేశారు. సంక్రాంతి సీజన్‌లో రెండు లేదా మూడు బిగ్ రిలీజ్‌లను సునాయాసంగా నిర్వహించవచ్చు, కానీ హెడ్-టు-హెడ్ ఫైట్‌లో ఓపెనింగ్ డే కలెక్షన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది.
అందుకే, రెండు సినిమాలూ బాగా ఆడేలా.. నిర్మాతలు విడతల వారీగా రిలీజ్‌లను ప్లాన్ చేశారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కన్ఫర్మ్ చేసినట్లు, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ జనవరి 9, 2026న లాంగ్ హాలిడే పీరియడ్‌ను ఫుల్ యూజ్ చేసుకుంటూ... ముందుగా రిలీజ్ అవుతుంది. ఐదు రోజుల తర్వాత, జనవరి 14, 2026న, మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి ఫెస్టివల్ డేకి పర్ఫెక్ట్‌గా సెట్ చేస్తూ.. థియేటర్స్‌లోకి వస్తుంది.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ ఏడాది జనవరి 14న డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. చిరంజీవి సినిమాతో ఆ సక్సెస్ ఫార్ములాను మళ్లీ రిపీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉంది, అక్టోబర్‌లో యూరోప్‌లో సాంగ్స్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. మరోవైపు, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ టీమ్ న్యూ ఇయర్ ముందు షూటింగ్ కంప్లీట్ చేసేందుకు రేస్ చేస్తోంది.
-
Home
-
Menu