చారిత్రక యుద్ధానికి సిద్ధమవుతోన్న 'ఫౌజీ'!

చారిత్రక యుద్ధానికి సిద్ధమవుతోన్న ఫౌజీ!
X

చారిత్రక యుద్ధానికి సిద్ధమవుతోన్న 'ఫౌజీ'!రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. 1940ల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఓ బ్రాహ్మణ యువకుడైన సైనికుడిగా కనిపిస్తాడట. యుద్ధ సన్నివేశాలకు లవ్ స్టోరీని మిళితం చేస్తూ ఈ సినిమా కథను ఆసక్తికరంగా మలుస్తున్నాడట డైరెక్టర్ హను.

ఇటీవల ప్రభాస్ గాయపడడంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చింది చిత్రబృందం. త్వరలోనే కీలక షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్‌లో నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటాన్ని హైలైట్ చేస్తూ రజాకార్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. భారీ ఎమోషనల్ యాక్షన్ సీన్స్‌తో ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని టాక్.

ఈ సినిమాతో సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుంది. మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి ప్రతిష్టాత్మక తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఓ హాలీవుడ్ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ పాత్ర కోసం గత ఆరు నెలలుగా మేకోవర్ తీసుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌తో 'ఫౌజీ' తెరకెక్కుతుంది.

Tags

Next Story