తెలుగు ‘దృశ్యం 3’ సంగతేంటి?

‘దృశ్యం’ మలయాళ ఫ్రాంచైజీ తెలుగు వెర్షన్.. తన గ్రిప్పింగ్ ప్లాట్, ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ సస్పెన్స్, సహజమైన, రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్‌లతో తెలుగు ఆడియెన్స్‌ను పూర్తిగా ఆకట్టుకుంది. మోస్ట్ సక్సైస్ ఫుల్ మలయాళ రీమేక్ గా ‘దృశ్యం’ తెలుగు వెర్షన్ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ విజయం.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసిందని చెప్పొచ్చు. ఇక తాజా అప్‌డేట్ ఏంటంటే.. మాలీవుడ్ లో ‘దృశ్యం’ ఫ్యామిలీ మొత్తం మూడవ ఇన్‌స్టాల్‌మెంట్ కోసం మళ్లీ ఒక్కటవుతోంది. ఈ మూడవ భాగం నిర్మాతలు ఇప్పటికే షూటింగ్ డేట్స్‌ను లాక్ చేశారు. ఇది ఫ్యాన్స్‌లో హైప్‌ను మరింత పెంచేసింది.
తాజా సమాచారం ప్రకారం మలయాళం, హిందీ వెర్షన్‌ల షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ 2 నుండి కిక్‌స్టార్ట్ కాబోతోంది. గాంధీ జయంతి రోజున ఈ ప్రాజెక్ట్ మొదలుకావడం వెనక ఓ స్పెషల్ కనెక్షన్ ఉంది. ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఈ తేదీ చాలా సింబాలిక్ ఇంపార్టెన్స్ ఉందని మేకర్స్ ఫీలవుతున్నారు. మలయాళ వెర్షన్‌లో మోహన్‌లాల్ తన ఐకానిక్ జార్జికుట్టి పాత్రలో మళ్లీ మ్యాజిక్ చేయనుండగా, హిందీ వెర్షన్‌లో అజయ్ దేవ్‌గన్ విజయ్ సాంగాంకర్‌గా తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇక తెలుగు ఆడియెన్స్ విషయానికి వస్తే, వాళ్ళు ఈ మూడో భాగం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. థియేటర్స్‌లో ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంతో ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అయితే, తెలుగు వెర్షన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు, ఇది ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన కలిగిస్తోంది.
మోహన్‌లాల్, అజయ్ దేవ్‌గన్ తమ షూటింగ్ షెడ్యూల్స్‌ను స్టార్ట్ చేయబోతుండగా, తెలుగు ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ స్టార్ వెంకటేష్ ‘దృశ్యం 3’ తెలుగు వెర్షన్‌ను త్వరగా మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ‘దృశ్యం 3’ ను ట్రెండ్ చేస్తూ, తమ ఎక్సైట్‌మెంట్‌ను బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. వెంకటేష్, తన సహజమైన నటనతో గత రెండు భాగాల్లోనూ ఆకట్టుకున్నాడు కాబట్టి, ఈ మూడో భాగంలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి వెంకీ వెర్షన్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
-
Home
-
Menu