ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం!

ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేయడం తెలుగు సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నిజాంపేటలో నివసిస్తున్న కల్పన, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. తక్షణ చర్యలతో ఆమెను ఆసుపత్రికి తరలించి, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
కల్పన తన మధుర గాత్రంతో తెలుగు చిత్రసీమలో అనేక సూపర్ హిట్ పాటలను ఆలపించి, శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. గతంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చినప్పటికీ, ప్రముఖ గాయని చిత్ర ప్రోత్సాహంతో ఆలోచనలను వీడి, జీవితంలో ముందుకు సాగారని పేర్కొన్నారు.
కల్పన గతంలో ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి, సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కల్పన త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, సంగీత ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.
-
Home
-
Menu