‘ఈ నగరానికి ఏమైంది 2’.. సంగతి ఏంటి?

‘ఈ నగరానికి ఏమైంది 2’..  సంగతి ఏంటి?
X
సినిమా 7వ యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మాస్ హింట్ డ్రాప్ చేశాడు.

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన బడ్డీ కామెడీ ఫ్లిక్ ‘ఈ నగరానికి ఏమైంది’. ఇప్పటికీ ఈ మూవీ యూత్‌లో ఫుల్ జోష్‌తో రాక్ చేస్తోంది . రీసెంట్‌గా రీ-రిలీజ్‌లో ఈ మూవీకి వచ్చిన మాస్ రెస్పాన్స్, బాక్సాఫీస్‌లో కుమ్మిన కలెక్షన్స్ చూస్తే, ఈ సినిమాకి ఉన్న క్రేజ్, లవ్ ఇంకా ఏ మాత్రం తగ్గలేదని అర్ధమౌతోంది. ఈ సినిమా రిలీజై ఏడేళ్లు అయినా.. ఫస్ట్ టైమ్ చూసిన ఫీల్‌ని యూత్ ఇప్పటికీ మిస్ అవ్వడం లేదు. అయితే ఈ రీ-రిలీజ్ తర్వాత నుంచి అందరి మైండ్‌లో ఒకటే తిరుగుతోంది. ‘ఈ నగరానికి ఏమైంది 2’ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అని ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఆ వెయిటింగ్ ఫైనల్‌గా క్లోజ్ అయ్యే టైమ్ వచ్చేసింది. సినిమా 7వ యానివర్సరీ సెలబ్రేషన్స్ సందర్భంగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మాస్ హింట్ డ్రాప్ చేశాడు. సీక్వెల్ గురించి ఓ బిగ్ అప్డేట్ త్వరలో రాబోతుందని సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఒక్క పోస్ట్‌తో ఫ్యాన్స్‌లో హైప్ మరింత పీక్స్‌కి వెళ్లిపోయింది. ఇక సీక్వెల్ డీటెయిల్స్‌లోకి వెళ్తే, ఒరిజినల్ గ్యాంగ్ మొత్తం రిటర్న్ అవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకుమాను తమ ఐకానిక్ రోల్స్‌లో మళ్లీ స్క్రీన్‌పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

‘ఈ నగరానికి ఏమైంది 2’ ని సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ బ్యానర్స్ బ్యాకింగ్‌తో సినిమాకి మరింత గ్రాండ్ టచ్ రాబోతుందని ఫిక్స్. అలాగే, ఫస్ట్ పార్ట్‌కి ఆల్‌టైమ్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన వివేక్ సాగర్ ఈ సీక్వెల్‌కి కూడా స్కోర్ చేస్తున్నాడు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఫస్ట్ పార్ట్‌లో సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story