దుల్కర్ సల్మాన్ జోడీగా పూజా హెగ్డే ?

దుల్కర్ సల్మాన్ జోడీగా పూజా హెగ్డే ?
X
పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను డెబ్యూ డైరెక్టర్ రవి తెరకెక్కించబోతున్నాడు.

పూజా హెగ్డే ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. అందరు టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని, భారీ రెమ్యూనరేషన్‌తో ఫుల్ డిమాండ్‌లో ఉండేది. కానీ, వరుసగా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తెలుగులో ఆమెకు పెద్ద ఆప్షన్స్ తగ్గిపోయాయి. అయినా, ఆమె ఆగకుండా తమిళం, హిందీ సినిమాల్లో ఫోకస్ పెట్టి, గత రెండేళ్లుగా అక్కడ బిజీగా మూవ్ అవుతోంది.

ఇప్పుడు తెలుగులో గ్రాండ్ రీ-ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తూ, సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఆమె కమ్‌బ్యాక్ మూవీ లాక్ అయినట్లు తెలుస్తోంది. అది కూడా దుల్కర్ సల్మాన్‌ మూవీతో. ఈ కొత్త తెలుగు సినిమాలో పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్‌ను డెబ్యూ డైరెక్టర్ రవి తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా గురించి త్వరలోనే ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందని టాక్. అసలు ఈ ప్రాజెక్ట్ చాలా రోజుల క్రితమే ఫైనలైంది. కానీ దుల్కర్ సల్మాన్ ఇతర సినిమాలతో సూపర్ బిజీగా ఉండటంతో షూటింగ్ స్టార్ట్ కావడం ఆలస్యమైంది.

ఇప్పుడు పూజాను టీమ్ సంప్రదించగానే.. ఆమె వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించబోతోంది. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ‘కాంత, ‘ఆకాశంలో ఒక తార’... ఈ రెండు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ కొత్త ప్రాజెక్ట్ కోసం కూడా టైమ్ కేటాయించాడు. పూజా హెగ్డే, దుల్కర్ కాంబో అనగానే ఫ్యాన్స్‌లో హైప్ మొదలైంది, ఎందుకంటే ఇద్దరూ స్క్రీన్‌పై కొత్త కెమిస్ట్రీ చూపించబోతున్నారు. ఈ సినిమా పూజాకు తెలుగులో మళ్లీ స్టార్‌డమ్ తెచ్చిపెడుతుందని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ కొత్త జోడీ ఆడియన్స్‌ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Tags

Next Story