‘కోర్ట్’ దర్శకుడికి స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్?

‘కోర్ట్’ దర్శకుడికి స్టార్ హీరో గ్రీన్ సిగ్నల్?
X
రామ్ జగదీష్ తదుపరి సినిమా కూడా నాని స్వంత బ్యానర్ అయిన వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పైనే రూపొందనుంది. రెండో చిత్రానికి కథను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం.

‘కోర్ట్’ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు రామ్ జగదీష్ . నాని నిర్మించిన ఈ కోర్ట్ డ్రామా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి.. రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచింది. డిజిటల్ మాధ్యమాల్లోనూ 'కోర్ట్'కు భారీ ఆదరణ లభించింది. విభిన్నమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించింది.

రామ్ జగదీష్ తదుపరి సినిమా కూడా నాని స్వంత బ్యానర్ అయిన వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పైనే రూపొందనుంది. రెండో చిత్రానికి కథను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. తాజాగా వస్తున్న ఊహాగానాల ప్రకారం, ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించే అవకాశ ముందట. దర్శకుడు ప్రస్తుతం దుల్కర్‌తో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నాని అండ్ దుల్కర్ సల్మాన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న "ఆకాశంలో ఒక తార" అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా దుల్కర్? అనేది వేచి చూసేద్దాం.

Tags

Next Story