డిజాస్టర్ టు డ్రీమ్ రన్.. భాగ్యశ్రీ ప్రస్థానం!

డిజాస్టర్ టు డ్రీమ్ రన్.. భాగ్యశ్రీ ప్రస్థానం!
X

మాస్ రాజా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బొర్సె కెరీర్ మాత్రం నెగెటివ్ స్టార్ట్‌ను దాటుకొని సూపర్ స్పీడ్‌లో ముందుకు సాగుతోంది.

తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, భాగ్యశ్రీకు వరుసగా పెద్ద ప్రాజెక్టులు వస్తుండటం విశేషమే. ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా ఇంప్రెషన్ చేయలేకపోయినా, ఆమె ప్రస్తుతం ఐదు క్రేజీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్'. తొలుత ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా శ్రీలీల ఎంపికయ్యింది. ఆ తర్వాత షెడ్యూల్స్ ఆలస్యమవ్వడంతో శ్రీలీల తప్పుకుంది. ప్రస్తుతం 'కింగ్‌డమ్'లో కథానాయికగా భాగ్యశ్రీ నటిస్తుంది. మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ కొత్త సినిమాలో భాగ్యశ్రీ నాయికగా నటిస్తుంది. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ రోల్ ఎంతగానోన ఇంప్రెస్ చేస్తుందని చెబుతున్నారు మేకర్స్.

ఇంకా దుల్కర్ సల్మాన్ 'కాంత' చిత్రంలోనూ భాగ్యశ్రీ నాయికగా నటిస్తుంది. సూర్యతో వెంకీ అట్లూరి తెరకెక్కించే సినిమా, ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసే మూవీస్ లోనూ భాగ్యశ్రీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మొత్తంగా.. డెబ్యూ మూవీ డిజాస్టర్ అయితే, కొత్త హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ, భాగ్యశ్రీ మాత్రం అందరి ఊహలను తలకిందులు చేస్తూ వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది.

Tags

Next Story