అనిల్ రావిపూడిని చూసి చాలా నేర్చుకోవాలి !

టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు అనిల్ రావిపూడిని చూసి చాలా నేర్చుకోవాలి. అతని వేగం చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో ఉంది. ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టాడు. టైమ్ వేస్ట్ చేయకుండా, వెంటనే మెగాస్టార్ చిరంజీవితో నెక్స్ట్ సినిమా మొదలు పెట్టేశాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసి, మూడో షెడ్యూల్‌కి రెడీ అవుతున్నాడు. ఇవన్నీ కేవలం ఆరు నెలల్లో జరిగిపోయాయి. త్వరలో చిరంజీవి, వెంకటేష్‌తో కీలక సీన్స్‌ని కూడా షూట్ చేయబోతున్నాడని తెలుస్తోంది.
అనిల్ కమర్షియల్ కామెడీ సినిమాలు చేసినా.. తక్కువ టైమ్‌లో క్వాలిటీ ఔట్‌పుట్ ఇస్తాడు. ఇది ప్రతి ఫిల్మ్‌మేకర్ నేర్చుకోవాల్సిన విషయం. ముఖ్యంగా, పాన్-ఇండియా కథల వెనకాల ఏళ్ల తరబడి టైమ్ వేస్ట్ చేస్తున్న యంగ్ డైరెక్టర్లు అనిల్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి.
2023లో 90 కోట్లు గ్రాస్ చేసిన డెబ్యూ సినిమా తీసిన ఒక యంగ్ డైరెక్టర్ ఇంకా తన సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ చేయలేదు. అదే సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి టైమ్ వేస్ట్ చేశాడు. అంతకుముందు.. 2020లో నేషనల్ అవార్డ్ గెలిచిన ఒక యంగ్ ఫిల్మ్‌మేకర్ కొన్ని నెలల క్రితమే తన సెకండ్ ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. ఇండస్ట్రీలో ఇలాంటి డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. అనిల్ రావిపూడి వర్క్ స్పీడ్, సక్సెస్ రికార్డ్ వాళ్లకి లెసన్‌లా ఉండాలి. అందరికీ అతడు ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి.
-
Home
-
Menu