మూడు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు

మూడు బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు
X
ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తుతం అతను ‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్యతో కొత్త సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది.

90స్ తెలుగు వెబ్ స్పేస్‌లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. ఈటీవీ విన్ కూడా ఫ్యామిలీ డ్రామాతో తమ మొదటి డిజిటల్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది. ఆదిత్య హాసన్ దర్శకుడిగా తొలి అడుగు వేసి.. వెంటనే పలు ఆఫర్లు అందుకున్నాడు. ఆ తర్వాత మలయాళ యూత్‌ఫుల్ ఫిల్మ్ ‘ప్రేమలు’ తెలుగు వెర్షన్‌కి డైలాగ్స్ రాశాడు. అతని డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి. సోషల్ మీడియా మీమ్స్, ట్రెండీ వన్-లైనర్స్‌ని సమర్థవంతంగా యాడాప్ట్ చేశాడు. డైలాగ్ రైటర్‌గానూ ఆదిత్య హాసన్‌కి ఫుల్ మార్కులు పడ్డాయి.

ఇదిలా ఉంటే.. అతడు తాజాగా.. ‘లిటిల్ హార్ట్స్’ అనే చిన్న ప్రాజెక్ట్‌ని నిర్మించాడు. ఈటీవీ విన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ని బ్యాంక్‌రోల్ చేశాడు. కంటెంట్‌తో ఇంప్రెస్ అయిన నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ మూవీ తొలి రోజు కలెక్షన్స్‌లో ‘ఘాటి, మదరాసి’ వంటి ఇతర రిలీజ్‌లను అధిగమించింది. వీకెండ్‌లో తెలుగు బాక్సాఫీస్‌ని పూర్తిగా డామినేట్ చేసింది. ఇది ఆదిత్య హాసన్‌కి మూడో సక్సెస్.

ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టాడు. ప్రస్తుతం అతను ‘బేబీ’ సినిమాలో కలిసి నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్యతో కొత్త సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లండన్‌లో జరుగుతోంది. ఈ టైటిల్ లేని సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ‘లిటిల్ హార్ట్స్’ సూపర్ సక్సెస్ తర్వాత, ఆదిత్య హాసన్ తదుపరి డైరెక్టోరియల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Tags

Next Story