‘మార్కో’ డైరెక్టర్ తో దిల్ రాజు?

‘మార్కో’  డైరెక్టర్ తో దిల్ రాజు?
X
ఈ ప్రాజెక్టు మల్టీస్టారర్‌గా ఉండే అవకాశముండగా, హీరోల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. సినిమా ప్రారంభం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో ఆసక్తికరమైన సినిమాకి శ్రీకారం చుట్టారు. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘మార్కో’ ఫేమ్ హనీఫ్ అదేనితో కలిసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు మల్టీస్టారర్‌గా ఉండే అవకాశముండగా, హీరోల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. సినిమా ప్రారంభం గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

గతేడాది డిసెంబరులో విడుదలైన ‘మార్కో’ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుని, బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనీష్ అదేని దర్శకత్వ శైలి, హీరో ఉన్ని ముకుందన్ నటనపై ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఆ దర్శకుడితో దిల్ రాజు చేసే ఈ కొత్త సినిమా టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది.

Tags

Next Story