‘ఆర్య 3’ సినిమాపై దిల్ రాజు క్లారిటీ !

టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలను స్టార్‌లుగా, సూపర్‌స్టార్‌లుగా మలిచిన లెజెండరీ నిర్మాత దిల్ రాజు. ఇమేజ్ లేని హీరోలను ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌లుగా మార్చడం, ఇప్పటికే ఉన్న స్టార్‌లను మరింత ఎత్తుకు తీసుకెళ్లడం ఆయన స్పెషాలిటీ. కానీ, ఇంతటి సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న దిల్ రాజు, తన సోదరుడు శిరీష్ కొడుకు ఆశిష్‌ను హీరోగా నిలబెట్టడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. ఆశిష్‌ను లాంచ్ చేస్తూ ‘రౌడీ బాయ్స్, లవ్ మి’ అనే రెండు సినిమాలను నిర్మించినా, ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు.
ఆశిష్ హీరోగా రెండేళ్ల క్రితం స్టార్ట్ అయిన ‘సెల్ఫిష్’ అనే సినిమా ఇప్పటివరకూ రిలీజ్ కాలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి దిల్ రాజు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా సుకుమార్‌తో కలిసి ఓ కూల్ ఐడియాతో మొదలైందని, సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో 50 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని చెప్పారు. కానీ, సగం సినిమా తీసిన తర్వాత ఔట్‌పుట్ చూస్తే ఏదో సరిపోలేదని పించిందని, అందుకే ఈ సినిమాను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టినట్లు రాజు వెల్లడించారు.
ఇక రీసెంట్ గా ‘ఆర్య-3’ గురించి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై దిల్ రాజు స్పందిస్తూ.. తాను సుకుమార్‌తో కలిసి ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా బట్టి ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. కానీ, ఇప్పటివరకూ ఫుల్‌ఫ్లెడ్జ్ స్క్రిప్ట్ రెడీ కాలేదని క్లారిటీ ఇచ్చారు. “‘ఆర్య’ సినిమాకు సుకుమార్ ఎంత ప్యాషన్‌తో పనిచేశారో, అలాంటి డైరెక్టర్‌తోనే ఈ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటున్నాం. స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత, దాని షేప్‌ను బట్టి హీరోను డిసైడ్ చేస్తాం. అది అల్లు అర్జున్‌తోనా, ఆశిష్‌తోనా, లేక వేరే హీరోతోనా అనేది తర్వాత నిర్ణయిస్తాం,” అని రాజు వివరించారు. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్‌లోనే ఉందని, రైట్ టైమ్‌లో రైట్ టీమ్‌తో దీన్ని తీసుకెళ్తామని ఆయన చెప్పారు.
ఆశిష్ హీరోగా ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో ఒకటి ‘దేత్తడి’, ఇది దిల్ రాజు స్వంత బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో నిర్మాణమవుతోంది. రెండో సినిమా గురించి పేరు వెల్లడించకపోయినా, అది బయటి బేనర్‌లో రూపొందుతోందని రాజు తెలిపారు. ఈ రెండు సినిమాల స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టులు షూటింగ్ స్టేజ్‌కు వెళ్తాయని ఆయన హింట్ ఇచ్చారు.
-
Home
-
Menu