ఢీ' రీ-రిలీజ్ టైమింగ్.. సరైన నిర్ణయమేనా?

ఢీ రీ-రిలీజ్ టైమింగ్.. సరైన నిర్ణయమేనా?
X

విష్ణు కెరీర్‌లో టైమ్‌లెస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన సినిమాల్లో 'ఢీ' (2007) ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిలేరియస్ కామెడీ అప్పట్లో క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాలోని డైలాగ్స్, కామెడీ ట్రాక్‌లు, బ్రహ్మానందం, సునీల్ తదితరుల వినోదాత్మక పాత్రలు నేటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటాయి. అలాంటి బ్లాక్‌బస్టర్‌ను తిరిగి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. మార్చి 28న ఈ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నారు.

అయితే అదే రోజు టాలీవుడ్ బాక్సాఫీస్ పోటీ అత్యంత రసవత్తరంగా ఉండబోతుంది. నితిన్-శ్రీలీల కాంబోలో తెరకెక్కిన 'రాబిన్‌హుడ్' మైత్రి మూవీ మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తోంది. అలాగే మార్చి 28న 'మ్యాడ్' సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' కూడా రాబోతుంది. ఇవి కాకుండా మార్చి 27న విక్రమ్ నటించిన 'వీరధీర శూర పార్ట్ 2' విడుదలవుతుంది. అలాగే మోహన్ లాల్ మోస్ట్ అవైటింగ్ 'ఎల్2: ఎంపురాన్' కూడా అదే రోజున బరిలోకి దిగుతోంది. ఈ భారీ పోటీ మధ్య 'ఢీ' రీ-రిలీజ్ అవ్వనుండడంతో ఫోకస్ కొత్త సినిమాల వైపు షిప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Tags

Next Story