ధనుష్ మూడో తెలుగు సినిమాకి సన్నాహాలు

తమిళ స్టార్ హీరో ధనుష్.. తమిళ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. తెలుగు, హిందీ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు. నటుడిగా తన కెరీర్‌ను సమతుల్యంగా నిర్వహిస్తూ, తెలుగులో 'సార్', 'కుబేర' అనే రెండు ఆకట్టుకునే చిత్రాలను అందించాడు. ఈ నేపథ్యంలో ధనుష్ ఇప్పుడు పలువురు తెలుగు దర్శకులు, నిర్మాతలతో చర్చలు జరుపుతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. ధనుష్ తన మూడో తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఊడుగుల.. గతంలో 'నీది నాది ఒకే కథ' , 'విరాట పర్వం' వంటి చిత్రాలను రూపొందించి, మంచి గుర్తింపు పొందాడు. ధనుష్ త్వరలో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని, చర్చలు చివరి దశకు చేరాయని సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును యూవీ క్రియేషన్స్ నిర్మించనుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ధనుష్ తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత, వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అలాగే.. ధనుష్ తమిళంలో దర్శకుడిగా, నిర్మాతగా కూడా బిజీగా ఉన్నాడు.
-
Home
-
Menu