దేవాకట్టా రాజకీయ ‘మయసభ’

దేవాకట్టా రాజకీయ  ‘మయసభ’
X
‘మయసభ’ అనేది కేవలం ఒక వెబ్ సిరీస్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇద్దరు దిగ్గజ వ్యక్తుల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందిన ఒక గ్రిప్పింగ్ డ్రామా.

దర్శకుడు దేవా కట్టా తన సినిమాల ద్వారా సామాజిక సందేశాలను చక్కగా ఆవిష్కరించే దర్శకుడిగా టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆయన చివరిగా తెరకెక్కించిన మూవీ ‘రిపబ్లిక్’. సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి ప్రశంసలు అందుకుంది. రాజకీయ నేపథ్యంలో సమాజంలోని అవినీతి, అసమానతలపై ప్రశ్నలు సంధించిన ఈ సినిమా.. దేవా కట్టా స్టైల్‌కు అద్దం పట్టింది. ఇప్పుడు ఆయన మరోసారి తన క్రియేటివ్ మ్యాజిక్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి ఒక రాజకీయ వెబ్ సిరీస్ రూపంలో ‘మయసభ’ అనే అస్త్రాన్ని సంధించబోతున్నాడు.

‘మయసభ’ అనేది కేవలం ఒక వెబ్ సిరీస్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇద్దరు దిగ్గజ వ్యక్తుల జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందిన ఒక గ్రిప్పింగ్ డ్రామా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి.. ఈ ఇద్దరు నాయకుల జీవితాలు, వారి రాజకీయ ప్రయాణం, విజయాలు, సవాళ్లు ఈ సిరీస్‌లో కీలకంగా చిత్రీకరించ బడనున్నాయి. తెలుగు రాజకీయాల్లో ఈ ఇద్దరి నాయకత్వ శైలి, ప్రజలతో వారి అనుబంధం.. ఇవన్నీ ‘మయసభ’ లో డీప్‌గా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నారు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సిరీస్‌లో చంద్రబాబు నాయుడు పాత్రలో టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి నటిస్తుండగా, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాత్రలో ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయిన చైతన్య రావు కనిపించనున్నారు. ఈ కాస్టింగ్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది, అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ ఇద్దరు నటులూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేస్తారని, వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని అంచనాలు ఉన్నాయి.

2025 చివరిలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఏ ప్లాట్‌ఫామ్ అనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ సిరీస్‌లో చంద్రబాబు, వై.ఎస్.ఆర్. పాత్రలతో పాటు మరికొన్ని కీలక పాత్రల్లో స్టార్ యాక్టర్స్ కనిపించనున్నారు. సీనియర్ నటుడు సాయికుమార్, బాలీవుడ్-టాలీవుడ్‌లో తన నటనతో ఆకట్టుకునే నాజర్, బాలీవుడ్ నటి దివ్యా దత్తా, యంగ్ టాలెంట్ తాన్యా రవిచంద్రన్, రవీంద్ర విజయ్, శ్రీకాంత్ అయ్యాంగార్, శత్రు వంటి వారు ఈ సిరీస్‌లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్టెల్లర్ కాస్ట్‌తో మాయాసభ ఒక విజువల్ ట్రీట్‌గా, డ్రామాతో కూడిన రాజకీయ కథనంగా రూపొందనుందని అంచనాలు ఉన్నాయి.

Tags

Next Story