ఐశ్వర్యా రాజేశ్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు?

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ విజయంతో ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ కెరీర్‌కు కొత్త లైఫ్ వచ్చినట్టయింది.
ఈ విజయం తర్వాత.. ఐశ్వర్యకు తెలుగులో పలు ఆఫర్లు రావడం ప్రారంభమైంది. తెలుగును స్వచ్ఛంగా మాట్లాడగలగడం ఆమెకు మిగతా నటీమణుల కన్నా అడ్వాంటేజ్ గా మారింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు ఆమె కొత్త సినిమాపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆమె అభిమానులు కొంత నిరాశ చెందుతున్నారు. ఐశ్వర్య త్వరగా తన కొత్త ప్రాజెక్టును ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఐశ్వర్య కొన్ని ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టి.... ఒక సినిమాకు సైన్ కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అభిమానులు మాత్రం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఐశ్వర్య కొత్త సినిమాను ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.
-
Home
-
Menu