వాయిదా పడిన దుల్కర్ ‘కాంత’ మూవీ

వాయిదా పడిన దుల్కర్ ‘కాంత’ మూవీ
X
విడుదలకు ఒక రోజు ముందు, సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘కాంత’ చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

మాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన ‘కాంత’ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా నిర్మాణ దశలోనే చాలా ఆసక్తి రేకెత్తించింది. అయితే, విడుదలకు ఒక రోజు ముందు, సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ‘కాంత’ చిత్ర బృందం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.

“మా టీజర్ విడుదలైనప్పటి నుంచి మీరు చూపించిన ప్రేమ, మద్దతు మమ్మల్ని నిజంగా కదిలించాయి. ఇది మాకు చాలా విలువైనది. మీకు అత్యుత్తమ అనుభవాన్ని అందించాలనే తాపత్రయాన్ని మరింత పెంచింది. ‘లోక’ సినిమా ఘన విజయం సాధించి బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. చంద్ర ఈ జోరును కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం.

మేము మీకోసం మరో అద్భుతమైన సినిమాటిక్ జర్నీని సిద్ధం చేస్తున్నాం. అందుకే, ‘కాంత’ విడుదలను వాయిదా వేశాం. సరికొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. అప్పటి వరకు మీ మద్దతుకు ధన్యవాదాలు. మిమ్మల్ని త్వరలో థియేటర్లలో కలవడానికి ఎదురుచూస్తున్నాం..” అని బృందం పేర్కొంది. సినిమా విడుదల తేదీపై రాబోయే రోజుల్లో అధికారిక సమాచారం వెలువడనుంది. మరి ‘కాంత’ మూవీ విడుదలయ్యేది ఎప్పుడో చూడాలి.

Tags

Next Story