వరుణ్ తేజ్ మూవీలో ‘స్వాగ్’ బ్యూటీ

వరుణ్ తేజ్ మూవీలో ‘స్వాగ్’  బ్యూటీ
X
ఇందులో రీతికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, తాజాగా దక్ష నగార్కర్ కూడా క్యాస్టింగ్ లో చేరింది. దక్ష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ విషయం తెలియజేసింది.

వ‌రుణ్ తేజ్ ఇటీవ‌ల బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలతో కాస్త తక్కువ ఫేజ్‌లో ఉన్నాడు. మళ్లీ తన స్ధానాన్ని తిరిగి పొందేందుకు, అతడు హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి మెర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌ మెంట్ సంయుక్తంగా ఈ ఇండో-కొరియన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో రీతికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, తాజాగా దక్ష నగార్కర్ కూడా క్యాస్టింగ్ లో చేరింది. దక్ష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ విషయం తెలియజేసింది. ఆమె పోస్ట్ చేసిన రెండు ఫోటోలలో ఒకటిలో మేకప్ రూమ్‌ అద్దం ముందు కూర్చొని సెల్ఫీ తీసుకుంటూ కనిపించగా, మరో ఫోటోలో ఆమె వెనిటీ వాన్ కనిపిస్తుంది. ఆ వాన్‌పై యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేర్లు స్పష్టంగా కనిపించాయి. ఈ విధంగా ఆమె ఈ ప్రాజెక్టులో భాగమని నిర్ధారించారు.

దక్షా నగార్కర్ ఇప్పటివరకు "జాంబీ రెడ్డి," "స్వాగ్," "హుషారు," "రావణాసుర" వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆమె హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Tags

Next Story