బౌండరీ దాటి బాక్సాఫీస్‌కి!

క్రీడా ప్రపంచం నుండి సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ కు, సినిమాలకు ఉన్న అపారమైన ఫాలోయింగ్ వల్ల, క్రికెటర్లు వెండితెరపై కనిపించడం సహజమే. కొన్ని సందర్భాల్లో క్రికెటర్లు అతిథి పాత్రల్లో మెరిసినా, కొంతమంది పూర్తి స్థాయి నటులుగా మారారు.
భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ వంటి వారు అతిథి పాత్రల్లో కనిపించారు. వీరు ప్రధానంగా క్రికెట్ నేపథ్యంలోని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించడం గమనార్హం. భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ నటనపై ఆసక్తిని ప్రదర్శిస్తూ పలు సినిమాల్లో నటించాడు. 2021లో విడుదలైన ‘ఫ్రెండ్షిప్‘ అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. విక్రమ్ ‘కోబ్రా‘ మూవీలో విలన్ పాత్రలో నటించాడు. అతని నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కూడా నటనా రంగంలోకి రాబోతున్నాడు. ఇక ఇండియన్ క్రికెటర్ కాకపోయినా.. ఇండియాతో మంచి అనుబంధం ఉన్న ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. నితిన్ ‘రాబిన్ హుడ్‘ మూవీతో నటుడిగా పరిచయమవుతున్నాడు వార్నర్.
బౌండరీ టు బాక్సాఫీస్ అంటూ ‘రాబిన్ హుడ్‘లో డేవిడ్ వార్నర్ ను పరిచయం చేస్తూ ఓ ఫోటో షేర్ చేసింది టీమ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వెంకీ కుడుమల తెరకెక్కిస్తున్న ‘రాబిన్ హుడ్‘ ఈనెల 28న థియేటర్లలోకి రాబోతుంది.
-
Home
-
Menu