ఆగష్టు లో క్రేజీ సినిమాల జాతర

నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆగస్టు విడుదలలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో మూడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

ఆగస్టు నెల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఆసక్తికరమైన నెలగా చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. 2025 సంవత్సరం ఇప్పటివరకు టాలీవుడ్‌కి నిరాశాజనకంగా ఉంది. అందుకే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆగస్టు విడుదలలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో మూడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా విడుదలవుతున్నాయి.

బకాసుర రెస్టారెంట్


ఎస్‌జే శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ సినిమాలో ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 8న విడుదల కానుంది.

బన్ బటర్ జామ్


తమిళంలో విజయం సాధించిన ఈ రొమాంటిక్ కామెడీ ఇప్పుడు తెలుగులోకి డబ్ అవుతోంది. రాజు జయమోహన్, ఆద్యా ప్రసాద్, భవ్య త్రిఖా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 8న విడుదలవుతోంది.

మాతృ


శ్రీరామ్, నందినీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ థ్రిల్లర్ సినిమాకి జాన్ జక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆగస్టు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వార్ 2


ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఇది ఒకటి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. 2019లో వచ్చిన బ్లాక్‌బస్టర్ వార్ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇది ఆగస్టు 14న విడుదల కానుంది.

కూలీ

ఆగస్టు 14న విడుదలవుతున్న మరో పెద్ద సినిమా ఇది. ‘వార్ 2’ తో ఢీకొట్టనుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

పరదా


సినిమా బండి, శుభం ఫేమ్ ప్రవీణ్ కంద్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ మహిళా ప్రధాన చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆసక్తికరమైన టీజర్, నవీనమైన ప్రమోషన్‌లతో ఈ సినిమా దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 22న ఈ చిత్రం విడుదల కానుంది.

మేఘాలు చెప్పిన ప్రేమ కథ


‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఆగస్టు 22న థియేటర్లలోకి రానుంది. విపిన్ దర్శకత్వంలో రబియా ఖాతూన్ కథానాయికగా నటిస్తోంది.

మాస్ జాతర


మాస్ మహారాజా రవితేజ ఈ నెలను ‘మాస్ జాతర’ సినిమాతో ముగించనున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానుంది. కఠిన పరిస్థితుల్లో ఉన్న రవితేజ ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతారేమో చూడాలి.

సుందరకాండ


నారా రోహిత్ నటించిన ఈ ఆలస్యమైన సినిమా చివరకు ఆగస్టు 27న విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో శ్రీదేవి విజయకుమార్, వృతి వాఘని కథానాయికలుగా నటిస్తున్నారు.

Tags

Next Story