క్రేజీ సినిమాలన్నీ సెప్టెంబర్ లోనే !

ఈ స్వాతంత్ర్య దినోత్సవ వీకెండ్ ఇండియన్ బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేసింది. 'వార్ 2', 'కూలీ' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్‌తో దుమ్ము రేపాయి. ఈ రెండు సినిమాలు థియేటర్లలో కొత్త జోష్ తెచ్చి... సినీ బిజినెస్‌ను మళ్లీ టాప్ గేర్‌లోకి తీసుకొచ్చాయి. ఈ ఉత్సాహంతో.. ఈ సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు తమ రిలీజ్ డేట్స్‌ను లాక్ చేసుకుని, ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న “ఓజీ” ఇప్పటికే సెప్టెంబర్ 25ని తన రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఊపేస్తూ.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ సునామీ సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.
సెప్టెంబర్ మొదటి వారంలో మాత్రం ఓ భారీ క్లాష్ తప్పేలా లేదు! అనుష్క శెట్టి నటిస్తున్న “ఘాటి”, తేజ సజ్జా హీరోగా చేస్తున్న “మిరాయ్” రెండూ సెప్టెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనున్నాయి. అనుష్క ఫ్యాన్స్ “ఘాటి” కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. “మిరాయ్” కూడా తన సరికొత్త కాన్సెప్ట్‌తో యూత్‌ను ఆకర్షిస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య పోటీ బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా ఉండబోతోంది. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న “కిష్కింధపురి” సెప్టెంబర్ 12ని తన రిలీజ్ డేట్‌గా లాక్ చేసుకుంది. ఈ సినిమా కూడా యాక్షన్, ఎమోషన్, డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.
అలాగే, తమిళ డబ్బింగ్ చిత్రం “భద్రకాళి” సెప్టెంబర్ 19న విడుదలవుతోంది. ఈ సినిమా తమిళ సినీ రసికులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకర్షించే అవకాశం ఉంది. మరోవైపు, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “అఖండ 2” సినిమా సెప్టెంబర్ నుండి తప్పుకునే ఛాన్స్ ఉంది. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడటంతో, సెప్టెంబర్‌లో విడుదలవుతున్న ఇతర చిత్రాలకు కాస్త ఊరట లభించనుంది. ఈ సినిమా ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్‌ను బట్టి చూస్తే, “అఖండ 2” ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.
మొత్తానికి సెప్టెంబర్ 2025 తెలుగు సినిమా లవర్స్‌కు ఓ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అవుతుందనడంలో డౌట్ లేదు. ఈ సినిమాలన్నీ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తాయో చూడాలి.
-
Home
-
Menu