‘కోర్ట్‘ ఓటీటీ డేట్ ఫిక్స్

‘కోర్ట్‘ ఓటీటీ డేట్ ఫిక్స్
X

పెద్దగా అంచనాలు లేకుండానే థియేటర్లలోకి వచ్చిన ‘కోర్ట్‘ సినిమా ఘన విజయాన్ని సాధించింది. నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. పోక్సో చట్టం ఇతివృత్తంతో సందేశాత్మక కథతో రూపొందిన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.




ఫోక్సో చట్టంలోని లోపాల నేపథ్యంలో అమాయక యువకుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. థియేట్రికల్ గా రూ.50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ‘కోర్ట్‘ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చేస్తోంది.

ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్ట్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. విశేషమేమిటంటే థియేటర్లలో కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలోనూ అందుబాటులోకి రాబోతుంది.

Tags

Next Story