సామాజిక సమస్యలపై ‘కోర్ట్’.. ట్రైలర్ కోసం వెయిటింగ్!

X
నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా ట్రైలర్ను మార్చి 7న విడుదల చేయనున్నట్లు ఓ ఆసక్తికరమైన వీడియో ద్వారా వెల్లడించారు. ఈ గ్లింప్స్ ను బట్టి ఈ చిత్ర కథ పోక్సో చట్టం నేపథ్యంలో నడుస్తూ, ఒక కీలక సామాజిక అంశాన్ని ముందుకు తెస్తుందని తెలుస్తోంది. ప్రియదర్శితో పాటు శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, హర్ష్ రోషన్ ఈ సినిమాలోఓ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Next Story
-
Home
-
Menu