అడ్వాన్స్ బుకింగ్స్ లో తెలుగు వెర్షన్ అదరగొడుతోంది!

సూపర్‌స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందిన.. “కూలీ” సినిమా.. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లతో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో బుకింగ్‌లు రికార్డు స్థాయిలో ఉన్నాయి.ప్రీమియర్ షోల కోసం అడ్వాన్స్ టికెట్ సేల్స్ ఇప్పటికే 1 మిలియన్ డాలర్స్ మార్క్‌ను దాటేసాయి.
తమిళ్ వెర్షన్ ముందంజలో ఉంది. అయితే, తెలుగు వెర్షన్ కూడా దీటుగా నిలిచింది. ఇప్పటికే 270K డాలర్స్ గ్రాస్ సాధించిన తెలుగు వెర్షన్.. రెండు రోజుల్లో 300K డాలర్స్ మార్క్‌ను అధిగమించే అవకాశం ఉంది. తమిళ సినిమాకు ఇది అద్భుతమైన సంఖ్య. ఈ హైప్ సినిమా చుట్టూ ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన “వార్ 2” ఇంకా 300K డాలర్స్ మార్క్‌ను తాకలేదు. “కూలీ”లో నాగార్జున ఆక్కినేని, శ్రుతి హాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్‌లతో కూడిన భారీ తారాగణం ఉంది. హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రతీకార థీమ్, బలమైన సామాజిక సందేశంతో ఈ సినిమా రూపొందింది.
-
Home
-
Menu