రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు

ఎప్పుడూ వివాదాలకు కేంద్రబిందువుగా ఉండే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసే సినిమాలు, చేసే కామెంట్లు తరచుగా వివాదాలను రేకెత్తిస్తుంటాయి. గతంలో వర్మ తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు‘ సినిమా మరోసారి చర్చనీయాంశమైంది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు సామాజికంగా విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో ఇప్పటికే ఫిర్యాదులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో గుంటూరు సీఐడీ అధికారులు వర్మకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే, ఈ నోటీసులను సవాల్ చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా వర్మపై వివిధ ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదవుతుండటంతో ఆయనకు వరుసగా నోటీసులు వస్తున్నాయి. న్యాయపరంగా తన వైఖరిని సమర్థించుకోవడానికి ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇక ఈ పరిణామాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసాయి. వర్మను కావాలని టార్గెట్ చేస్తున్నారని, ఆయన స్వేచ్ఛను హరిస్తున్నారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు, కొన్ని వర్గాలు మాత్రం ఆయనపై తీసుకున్న చర్యలు సరైనవేనని అభిప్రాయపడుతున్నాయి. రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఏ విధమైన ఊరట లభిస్తుందనేది చూడాల్సిన విషయమే.
-
Home
-
Menu