చిరంజీవి డేట్‌ను లాక్ చేసిన ‘తమ్ముడు’!

చిరంజీవి డేట్‌ను లాక్ చేసిన ‘తమ్ముడు’!యూత్‌స్టార్ నితిన్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 'తమ్ముడు'. శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. వర్ష బొల్లమ్మ, 'కాంతార' ఫేమ సప్తమి గౌడ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'తమ్ముడు'ని తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ శ్రీరామ్ వేణు.
అసలు మహాశివరాత్రి కానుకగా ఈనెలలోనే 'తమ్ముడు' చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవ్వడంతో రిలీజ్ ఆలస్యమయ్యింది. లేటెస్ట్ గా ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. టాలీవుడ్ హిస్టరీలో మే 9కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్నో సూపర్ హిట్ మూవీస్ అదే డేట్ కి వచ్చి చరిత్ర సృష్టించాయి. ఈ ఏడాది మే 9న మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'ను కూడా విడుదల చేయబోతున్నారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పటివరకూ అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు మార్చి 28న 'రాబిన్‌హుడ్'తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. మొత్తంగా.. రెండు నెలలో గ్యాప్ లోనే 'రాబిన్‌హుడ్, తమ్ముడు' చిత్రాలతో ఆడియన్స్‌ను అలరించడానికి వచ్చేస్తున్నాడు నితిన్.
-
Home
-
Menu