బాసూ.. ఈ ఏజ్ లోనూ ఏంటా గ్రేసూ?

బాసూ.. ఈ ఏజ్ లోనూ ఏంటా గ్రేసూ?
X
ఇటీవల.. హైదరాబాద్‌లో జరిగిన ఈటీవీ తెలుగు 30 ఏళ్ల వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి, తన అద్భుతమైన నటనతోనే కాకుండా, ఐకానిక్ డాన్స్ మూమెంట్స్‌తోనూ కింగ్ అనిపించుకున్నారు. దాదాపు 70 ఏళ్ల వయసులోనూ ఆయన చార్మ్, ఎనర్జీ అసాధారణం. స్టేజ్‌పై ఆయన గ్రేస్ ఫ్యాన్స్‌ని ఇప్పటికీ ఆకట్టుకుంటుంది. ఆయన స్పాంటేనియస్ అప్పియరెన్స్‌లు ఎప్పుడూ ఆకర్షిస్తాయి.

ఇటీవల.. హైదరాబాద్‌లో జరిగిన ఈటీవీ తెలుగు 30 ఏళ్ల వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా చిరు డాన్స్‌ని ఆరాధించే ఫ్యాన్స్ దానికి ఫిదా అవుతున్నారు . వేడుకల్లో 1994లో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలోని పాపులర్ సాంగ్ ‘చామంతి పువ్వా..’ ప్లే అవుతుండగా.. అందాల హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్టేజ్‌పై డాన్స్ చేస్తోంది. ఆమెను చూసిన చిరంజీవి.. సరదాగా జాయిన్ అయ్యి.. తన ఎఫర్ట్‌లెస్, ఎనర్జిటిక్ డాన్స్ మూవ్స్‌తో స్టేజ్‌కి అందం తెచ్చారు. ఈ స్పాంటేనియస్ మూమెంట్ క్షణాల్లో వైరల్ సెన్సేషన్‌గా మారింది.

ఫ్యాన్స్ తమ అభిమాన హీరోని ఇంత ఉత్సాహంతో చూసి థ్రిల్ అయ్యారు. ఆయన అపారమైన ప్యాషన్‌ని మెచ్చుకున్నారు. ఇది ఫార్మల్ పెర్ఫార్మెన్స్ కానప్పటికీ, చిరు ఆ మూమెంట్‌ని ఎంబ్రేస్ చేసిన తీరు... ఆయన ఎందుకు ఎవర్‌గ్రీన్ స్టార్ అని అందరికీ గుర్తు చేసింది.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే, అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా, బాబీ కొల్లితో మరో ప్రాజెక్ట్, డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలాతో ఇంకో సినిమా లైనప్‌లో ఉన్నాయి. మొత్తం నాలుగు సినిమాలు డెవలప్‌మెంట్‌లో ఉండడంతో, మెగా ఫ్యాన్స్ చిరు సిల్వర్ స్క్రీన్ ప్రెజన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story