స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో మెగా ‘విశ్వంభర’

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ విడుదలైన నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ డ్రామా ‘విశ్వంభర’ మీద మెగా ఫ్యాన్స్ దృష్టి మళ్లింది. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మళ్లీ వార్తల్లో నిలిచింది. హైదరాబాద్‌లో చిరంజీవి, బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌లతో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.
భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాట, చిరంజీవి గత చిత్రం అన్నయ్యలోని ఆట కావాలా లాంటి ఐకానిక్ హిట్స్‌ను గుర్తుచేస్తూ, కొత్త రుచితో నాస్టాల్జియాను అందిస్తుందని అంటున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ డాన్స్ నంబర్‌ను రూపొందిస్తున్నారు. ఇది రాబోయే కొన్ని రోజుల్లో షూట్ అవుతుంది. ఇదిలా ఉండగా.. చిరంజీవి ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘విశ్వంభర’ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆశిక రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
-
Home
-
Menu