యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అవార్డు!

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కబోతుంది. యూకే ప్రభుత్వం ఆయనను ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’తో సత్కరించనుంది. నాలుగున్నర దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని ప్రకటించడం గర్వకారణం.
ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును మార్చి 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అందించనున్నారు. ఇది భారతీయ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా తెలుగు చిత్రసీమకు గౌరవాన్ని తీసుకువచ్చే విశేషమైన ఘట్టం.
ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు. వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చివరి దశ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే ఈ సోషియో ఫాంటసీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్టాఫ్ స్క్రిప్ట్ లాక్ చేశాడట అనిల్ రావిపూడి. వచ్చే సంక్రాంతి టార్గెట్ గా చిరు-అనిల్ మూవీ రెడీ కానుంది. 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో మెగాస్టార్ మరో మూవీని లైన్లో పెట్టారు.
-
Home
-
Menu