చిరు - బాబీ మూవీ షూటింగ్ ఎప్పటినుంచి?

చిరు - బాబీ మూవీ షూటింగ్ ఎప్పటినుంచి?
X
సెప్టెంబర్ 2025 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించిన బజ్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ వంటి టాప్ స్టార్స్‌తో కలిసి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ బాబీ కొల్లి.. మరోసారి చిరంజీవితో జోడీ కడుతున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా, సెప్టెంబర్ 2025 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గురించిన బజ్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సినిమాటోగ్రాఫర్‌గా తన కెరీర్‌ని స్టార్ట్ చేసి, ఆ తర్వాత డైరెక్టర్‌గా మారిన కార్తీక్ ఘట్టమనేనిని రంగంలోకి దింపారు. కార్తీక్ తన సినిమాటోగ్రఫీ స్కిల్స్‌తో ఈ సినిమాకి విజువల్ మ్యాజిక్ తీసుకొస్తారని అందరూ ఆశిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ‘దసరా’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలతో కూడా చిరు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కానీ.. శ్రీకాంత్ ప్రస్తుతం నాని హీరోగా ‘ది ప్యారడైస్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. దీంతో ఆ ప్రాజెక్ట్ మొదలవడానికి కాస్త టైమ్ పట్టొచ్చు.

చిరంజీవి షెడ్యూల్ ప్రస్తుతం సూపర్ ప్యాక్డ్‌గా ఉంది. బాబీ కొల్లితో ఈ కొత్త సినిమా, అనిల్ రావిపూడితో ఓ ప్రాజెక్ట్, శ్రీకాంత్ ఒదెలతో మరో సినిమా, ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ‘విశ్వంభర’ ... ఇవి నాలుగు సినిమాలు ఖాయంగా ఉండగా.. ఇంకా కొన్ని ప్రాజెక్ట్‌లు జోడైనా ఆశ్చర్యం లేదు. చిరంజీవి ఏమాత్రం స్పీడ్ తగ్గించే ఆలోచనలో లేరని స్పష్టం. ఈ వయసులోనూ ఈ ఎనర్జీ, ఈ డెడికేషన్ చూస్తే ఫ్యాన్స్‌కి పూనకాలే. రాబోయే నెలల్లో ఒక్కో అప్‌డేట్‌తో సోషల్ మీడియాని షేక్ చేయడానికి మెగాస్టార్ సిద్ధంగా ఉన్నారు.

Tags

Next Story