ఫేవరేట్ ప్లేస్ లో చైతూ, శోభిత విహారం !

అక్కినేని నవ యువ సామ్రాట్ నాగ చైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ జంట తరచుగా తమ సంసార జీవితంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకుంటూ.. అందరిచేత పర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. తాజాగా.. శోభిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను పంచుకుంది. ఇవి చైతన్యతో కలిసి ఆమె గడిపిన ప్రత్యేకమైన రోజును ప్రతిబింబించాయి.
ఈ సారి ఈ జంట... రేసింగ్ ట్రాక్ ను సందర్శించి... తమ జీవితానికి మరొక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని జోడించుకున్నారు. ఆటోమొబైల్ రేసింగ్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న నాగ చైతన్య.. తన ప్రియమైన భార్య శోభితను తన ఫేవరెట్ స్పాట్ అయిన రేస్ ట్రాక్ కి తీసుకెళ్లాడు. ఈ ఇద్దరూ స్టైలిష్ అవుట్‌ఫిట్స్ ధరించి.. నిజంగా రేసింగ్ ఆహ్లాదాన్ని ఆస్వాదించారు.
ఈ స్పెషల్ డేట్‌లో, చైతన్య, శోభిత ఇద్దరూ రేస్ కార్లు నడిపే అనుభూతిని ఆస్వాదించగా.. పరస్పరం ఫోటోలు తీసుకుంటూ తాము ఎంతసేపూ ఎంజాయ్ చేసారో అభిమానులకు చూపించారు. ఓ ఫోటోలో శోభిత, నాగ చైతన్య కారులో కూర్చొని డ్రైవ్ చేయడానికి రెడీ అవుతుండగా, ఆవిడ ముచ్చటగా చూస్తూ ఆనందిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఇది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ జంట షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ, అభిమానులను మరింత ఉత్సాహపరుస్తున్నాయి. ఈ నూతన జంట మరెన్నో హ్యాపీ మూమెంట్స్‌ను పంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
-
Home
-
Menu