బాలకృష్ణకు పద్మభూషణ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం!

గడిచిన 50 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు నటసింహం బాలకృష్ణ. ఐదు దశాబ్దాలుగా నటనలో కొనసాగుతూ.. ఇప్పటికీ అగ్ర తారగా దూసుకెళ్తున్న క్రెడిట్ బాలయ్య సొంతం. నటనతో పాటు, రాజకీయాలు, సామాజిక సేవల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్నారు. బాలకృ
మరోవైపు రెండు దశాబ్దాలుగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా సేవ చేస్తూ అనేక మందికి ఆసరాగా నిలిచారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు, రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు.
చిత్ర పరిశ్రమకు చేస్తున్న సేవతో పాటు.. సామాజిక కార్యక్రమాల్లోనూ తన వంతుగా చేస్తున్న కృషికి ఫలితంగా బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డు వరించినట్టు తెలుస్తుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తర్వాత పద్మభూషణ్ పొందిన నటుడిగా నటసింహం బాలకృష్ణ నిలిచారు.
-
Home
-
Menu