డకాయిట్' కోసం బాలీవుడ్ విలక్షణ దర్శకుడు!

డకాయిట్ కోసం బాలీవుడ్ విలక్షణ దర్శకుడు!
X
Bollywood's iconic director for 'Dakot'!

అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘డకాయిట్’ భారీ అంచనాలతో రూపొందుతోంది. శానీల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది. లేటెస్ట్ గా ఈ మూవీలో బాలీవుడ్ విలక్షణ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపిస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఈ సినిమాలో ఇన్‌స్పెక్టర్ స్వామి పాత్రలో అనురాగ్ కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించి ఓ పోస్టర్ ను హీరో అడవి శేష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.




'దీక్షలో ఉన్న పోలీస్ నన్ను పట్టుకుంటాడు అట.. నన్ను పట్టుకోవాలంటే ఆ దివుడే దిగి రావాలి ఏమో' అంటూ అనురాగ్ పోషిస్తున్న ఇన్‌స్పెక్టర్ స్వామి పాత్రను పరిచయం చేశాడు శేష్. 'డకాయిట్.. ఒక ప్రేమ కథ' టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సుప్రియ యార్లగడ్డ, సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Tags

Next Story