ప్రభాస్ ‘ఫౌజీ‘ కోసం బాలీవుడ్ స్టార్స్?

ప్రభాస్ ‘ఫౌజీ‘ కోసం బాలీవుడ్ స్టార్స్?
X

రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతోంది. ‘సీతారామం’తో క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హను రాఘవపూడి, ఇప్పుడు ప్రభాస్ సినిమాని యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో విజువల్ వండర్‌ గా తీర్చిదిద్దుతున్నాడట.

తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. బాలీవుడ్ వెటరన్ స్టార్ సన్నీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడనేది ఆ న్యూస్. ముఖ్యంగా ‘ఫౌజీ‘ సెకండ్ హాఫ్‌లో సన్నీ డియోల్ రోల్ ఎంతో ప్రధానంగా ఉంటుందట. అలాగే మరో బాలీవుడ్ స్టార్ అలియా భట్ కూడా ‘ఫౌజీ‘లో నటించబోతుందనే ప్రచారం ఉంది. అలియా ఓ యువరాణి పాత్రలో కనిపించనుందట. గతంలో ఈ పాత్ర కోసం సాయిపల్లవి పేరు కూడా వినిపించింది.

అయితే ‘ఫౌజీ‘లో సన్నీ డియోల్, అలియా భట్ ఎంట్రీపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వీ నటిస్తుంది. ఇతర కీలక పాత్రలో జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి వారు కనిపించబోతున్నాడు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story