బోల్డ్ లుక్, వైల్డ్ ఎనర్జీ – నాని కొత్త అవతారం!

బోల్డ్ లుక్, వైల్డ్ ఎనర్జీ – నాని కొత్త అవతారం!నేచురల్ స్టార్ నాని అంటే ఎక్కువగా పక్కింటబ్బాయి తరహా పాత్రలే గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ఎక్కువగా మురిపించిన నానిని ‘దసరా‘ సినిమాతో ఊర మాస్ గా ప్రెజెంట్ చేశాడు శ్రీకాంత్ ఓదెల. ఒకవిధంగా ‘దసరా‘ తర్వాత నాని వయలెంట్ గా మారిపోయాడని చెప్పొచ్చు. అదే ఇప్పుడు ‘హిట్ 3‘లోనూ కంటిన్యూ చేస్తున్నాడు.
ఇక ‘హిట్ 3‘ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్‘ను తీసుకు రాబోతున్నాడు నేచురల్ స్టార్. ‘దసరా‘కి ఎన్నో రెట్లు మించిన రీతిలో ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది టీమ్. ఇప్పుడు ‘ది ప్యారడైజ్‘ గ్లింప్స్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. మార్చి 3న ‘ది ప్యారడైజ్‘ నుంచి గ్లింప్స్ రాబోతుంది. అందుకు సంబంధించి ఎడిట్ లాక్ అయ్యిందని.. బోల్డ్ అండ్ వైల్డ్ లుక్ లో నేచురల్ స్టార్ ని చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ హింట్ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.
-
Home
-
Menu