బిగ్ అప్డేట్ రాబోతోంది !

ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక క్రేజీ కలయిక ఇక నిజం కాబోతుంది. 'పుష్ప'తో పాన్ ఇండియా గుర్తింపు పొందిన అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అట్లీ కలిసి చేయబోయే సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇద్దరి కమిట్‌మెంట్, క్రియేటివ్ విజన్, ఫ్యాన్ బేస్ చూసి ఇండస్ట్రీలోనే కాదు, ప్రేక్షకుల హృదయాల్లో కూడా భారీ ఊహలు మొదలయ్యాయి.
ఈ రోజు 11 గంటలకు బన్నీ-అట్లీ కాంబో మూవీ నుంచి బిగ్ అప్డేట్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా వదిలారు మేకర్స్. ఇది ఫస్ట్ లుక్ అవుతుందా? టైటిల్ అనౌన్స్‌మెంట్ అవుతుందా? లేక మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ లేదా విడుదల తేదీ సంబంధిత సమాచారం కావచ్చా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా హ్యాష్‌ట్యాగ్స్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులూ, అట్లీ మాస్ టేకింగ్‌ను ఇష్టపడే జనాలూ ఈ అప్డేట్‌ను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా టాలీవుడ్ హీరో, కోలీవుడ్ డైరెక్టర్ కలయికతో ఏర్పడుతుంది కాబట్టి ఇది దక్షిణాది ఇండస్ట్రీల మధ్య సెట్ చేసే విధంగా మారే అవకాశముంది. శంకర్-రజినీకాంత్ కాంబో తరహాలోనే బన్నీ-అట్లీ కాంబోనూ ఎంతో క్రేజీగా పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి నిర్మాణ సంస్థలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టెక్నికల్ టీమ్ ఎంపిక కూడా హై స్టాండర్డ్‌గానే ఉందని టాక్. మరి ఈ రోజు రాబోయేది ఎలాంటి అప్డేటో చూడాలి.
-
Home
-
Menu