రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..!

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..!
X
తాజా సమాచారం ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. దీని విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూవీ నుంచి నెక్స్ట్ అనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. 'ఓజీ' చుట్టూ భారీ బజ్ వచ్చిన తర్వాత, అందరి దృష్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై పడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీస్ లో ఒకటి. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.

తాజా సమాచారం ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. దీని విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం పవర్ స్టార్ తన లుక్‌ను మార్చుకున్నట్లు సమాచారం. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండడంతో అభిమానులలో మరింత ఉత్సాహం పెరిగింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మాస్ అంశాలు, పవర్ఫుల్ డైలాగులు, ఎనర్జిటిక్ సంగీతంతో కూడిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ఉంటుందని చెబుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మేకర్స్ ఎప్పుడు ఆ పెద్ద అప్‌డేట్‌ను వెల్లడిస్తారా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Tags

Next Story